– హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అద్యక్షులు
– డా. ఎన్. గౌతమ్ రావు, మాజీమంత్రి సీ కృష్ణ యాదవ్
నవతెలంగాణ-అంబర్‌పేట
యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తి అని బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డా. ఎన్. గౌతమ్ రావు కొనియాడారు. బీజేపీ నగర కార్యాలయంలో నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి సందర్బంగా గౌతమ్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చికాగో వేదికగా భారతదేశ సాంస్కృతిక, సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి స్వామి వివేకానంద అన్నారు. నేటి ఆధునిక సమాజంలో అనేక సమస్యలు ఎదురవుతున్నప్పటికీ యువత స్వామి వివేకానంద చెప్పిన సూక్తులను అను సరించి విజయాలు సాధిస్తున్నారని తెలిపారు. మాజీ మంత్రి కృష్ణ యాదవ్, సీనియర్ నేతలు వీరెల్లి చంద్రశేఖర్, నంద కిషోర్, సూర్య ప్రకాష్ సింగ్, అజరు, శ్యామ్ రాజ్, నాగభూషణ్ చారి, శ్రీనివాస్ రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
స్వామి వివేకానందుని బోధనలను అందరూ ఆచరించాలి
నవతెలంగాణ-అంబర్‌పేట
యువత స్వామి వివేకాందను స్ఫూర్తిగా తీసుకుని ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా మెంబర్ పెరిక సురేష్ పిలుపు నిచ్చారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో స్వామి వివేకాంద 161వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడు తూ ఇనుపకండలు, ఉక్కునరాలున్న యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. సనాతన ధర్మ పూర్వ వైభవాన్ని తిరిగి స్థాపించ డానికే ఆయన భూమిపైకి తెంచారన్నారు. స్వామి వివేకానంద బోధనలను అందరూ ఆచరిం చాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్, ప్రధానకార్యదర్శి ప్రేమేంద ర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు
నవతెలంగాణ-ముషీరాబాద్
స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకా నంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ హాజరైవివేకానంద. ఆలోచన, ఆచరణ, విజయం వివేకానందుని విధానం. వివేకానందు డే యువతకు మార్గదర్శి, యువతలో మంచి ఆలోచనలతో భవిష్యత్తుని నిర్మిస్తే దేశమే ప్రపం చానికి గర్వకారణంగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఓ.పావని, దైవజ్ఞ శర్మ, ఎన్‌సిసి వాలంటీర్లు పాల్గొన్నారు.
ప్రపంచానికి మార్గదర్శకులు వివేకానంద స్వామి
కార్పొరేటర్ ఇ. విజయ్ కుమార్ గౌడ్
నవతెలంగాణ-అంబర్‌పేట
ప్రపంచానికి యువతకి సమాజానికి వివేకానంద స్వామి మార్గదర్శ కులని అంబర్ పేట కార్పొరేటర్ ఇ. విజయ్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం గోల్నాక డివిజన్ పరిధిలోని గంగ నగర్ లో వివేకానంద జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథి హాజరై ఈ సందర్భంగా కార్పొరేటర్ ఇ. విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ చికాగో వేదికగా భారతదేశం యొక్క సాంస్కతిక, భారతదేశ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి స్వామి వివేకానంద అని నేటి ఆధునిక సమాజంలో అనేక సమస్యలు ఎదురవుతున్నప్పటికీ యువత స్వామి వివేకానంద చెప్పిన సూక్తులను అనుసరించి విజయాలు సాధిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయ కులు ఆర్కే బాబు, చందర్, సురేష్ గౌడ్, మల్లికార్జున్, వాసు, కుమార స్వామి, హరీష్, మధు, రాజు, సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.