కృష్ణవేణి లో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
 మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో  స్వామి వివేకానంద 161వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. స్వామి వివేకానంద యువతకు ఆదర్శమని, అలాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రపంచ దేశాలకు భారతదేశ గొప్పతనాన్ని చాటిచెప్పిన గొప్ప మహనీయుడని గుర్తు చేశారు. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయం, హిందూ సనాత ధర్మాన్ని చాటిచెప్పిన ఘనత స్వామి వివేకానందదే అన్నారు. దేశానికి యువతే పట్టుకొమ్మలని వారు సంకల్ప బలంతో ఏదైనా సాధించగలరని స్వామి వివేకానంద యువతకు సందేశం ఇచ్చారని గుర్తు చేశారు. అంతకుముందు  పాఠశాలలో 6తరగతి చదువుతున్న విద్యార్థి వర్షిత్ స్వామి వివేకానంద వేషధారణలో చూపరులను ఆకట్టుకున్నారు.పాఠశాలలోని ఆరవ తరగతి విద్యార్థినిలు శామిలి తెలుగు భాషలో, సానిక హిందీ భాషలో, ఐదవ తరగతి విద్యార్థి హిమానిస్ ఆంగ్ల భాషలో స్వామి వివేకనంద జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు.ఆరవ తరగతి విద్యార్థినిలు శామిలి, రుచితలు దేశభక్తి గేయాన్ని ఆలపించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చిలుక గంగా ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ కుందారం సచిన్, ఉపాధ్యాయులు కమల్, స్రవంతి, మనోజ్ఞ, రమ్య, తబసుమ్, స్వప్న, రూప శ్రీ, షాహిన్, నిఖిత, తదితరులు పాల్గొన్నారు