స్వామి వివేకానంద జయంతి (జాతీయ యువజన దినోత్సవం) సందర్భంగా బీజేపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం ముందు ఉన్న వివేకానంద విగ్రహానికి కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులలో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేశారని, రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశారని అన్నారు. నేటి యువత వివేకానంద ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, ఆయన చూపిన బాటలో నడిచి ఆయన సూక్తులను తూచా తప్పకుండా పాటించాలని అన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక వివేకానంద జయంతి రోజున జాతీయ యువజన దినోత్సవం గా నిర్వహించుకుంటున్నమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి , అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, పట్టణ అధ్యక్షుడు భరత్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీకాంత్, కౌన్సిలర్ నరేందర్, నాయకులు సంతోష్ రెడ్డి, వేణు, రాజు, ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.