ఎబివిపి తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో లో స్వామి వివేకానంద సుభాష్ చంద్ర బోస్ ల జయంతి పురస్కరించుకొని యువజన ఉత్సవాలలో భాగంగా మంగళవారం చివరి రోజు, క్విజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు అందరూ ఇలాంటి సృజనాత్మక కార్యక్రమాల్లో ముందుఉండాలని ,స్వామి వివేకానంద ,సుభాష్ చంద్రబోస్ లను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని , దేశ సేవలో మరియు దేశానికి అపద వచ్చినప్పుడు యువత ముందు వరుసలో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎబివిపి జాతీయ కార్యవర్గ సభ్యుడు శివ,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాగరాజు, నాయకులు సాయికుమార్, అమృత్ చారి, హరిక్రిష్ణ ,రుషి ,చందు ,నరేష్,ప్రమోద్, సింహాద్రి, నరసింహ, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.