స్వామి వివేకానంద జీవితం భావితరాలకు ఆదర్శం 

– ఘనంగా స్వామి వివేకానంద 161 జయంతి వేడుకలు
– సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య 
నవతెలంగాణ –  హుస్నాబాద్ రూరల్
కుల, మత, జాతి, లింగ భేదం లేకుండా సకల జనుల శ్రేయస్సు కోరిన స్వామి వివేకానంద జీవితం భావితరాలకు ఆదర్శమని హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య అన్నారు. భారత దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన స్వామి వివేకానంద 161 వ జయంతిని కాంగ్రెస్ నాయకులు శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సింగల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య , టిపిసిసి సభ్యులు కేడం లింగమూర్తి మాట్లాడుతూ..అంటరానితనం, మూఢనమ్మకాలతో నిరాశ నిస్పృహలతో ఉన్న దేశ పౌరులకు తన ప్రవచనాలతో మార్గం చూపిన మహనీయుడని అన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బంక చందు, సింగిల్ విండో వైస్ చైర్మన్ ఎగ్డీడి ఐలయ్య, నాయకులు వెన్న రాజు, బురుగు కిష్ట స్వామి,బొంగోని శ్రీనివాస్ గౌడ్, పోలు సంపత్, ఐలేష్ యాదవ్. బూరుగు సతీష్. బత్తుల రవి. అలువోజు రవీందర్. సావుల మధు. రమేష్. గడిపే చిన్న. పున్న రంజిత్. నాగేష్. గట్టు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.