స్వామి వివేకానంద జీవన విధానం, బోధనలు యావత్ ప్రపంచానికి మార్గదర్శకమని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్వామి వివేకానంద జన్మదినం పురస్కరించుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద గల ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే తో కలిసి పూలమాలలు వేసి నమస్సు మాంజలి అర్పించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ.. స్వామి వివేకానంద జీవన విధానం, ఆయన బోధనలు యావత్ ప్రపంచానికే మార్గదర్శమని, భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. జిల్లా కలెక్టర్ హనుమంతు కే. జెండగే మాట్లాడుతూ… స్వామి వివేకానంద మాటలు రాబోయే తరాలకు అత్యంత స్ఫూర్తినిచ్చే సూక్తులని, గమ్యం చేరేవరకు విశ్రమించవద్దని, అలుపెరుగని ప్రయత్నాలతోనే గెలుపును నిర్దేశించుకోవచ్చునని అన్న అయన మాటలు ఎప్పటికీ అనుసరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ ఏ.భాస్కర్ రావు, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి.వీరారెడ్డి, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎస్.వెంకట్ రెడ్డి, జిల్లా యువజన సంక్షేమ అధికారి ధనంజనేయులు, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, స్థానిక యం.పి.పి. నరాల నిర్మల, పర్వతారోహకురాలు అన్విత రెడ్డి, జిల్లా అధికారులు, యువతి యువకులు, ఎన్సీసీ క్యాడెట్లు, ప్రజలు పాల్గొన్నారు.