స్వామినాథన్ కమీషన్ సిఫార్సులు అమలు చేయాలి…

– ధాన్యానికి మద్దతు ధర నిర్ణయించాలి…
– రైతు సంఘం ఆద్వర్యంలో ధర్నా…
నవతెలంగాణ – అశ్వారావుపేట: వ్యవసాయం రంగంలో స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలని, ధాన్యానికి మద్దతు ధర నిర్ణయించాలి అనే డిమాండ్ లతో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం ఆ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య మాట్లాడుతూ ఏటికేడు సాగు వ్యయం పెరుగుతున్నా దానికి అనుగుణంగా పంట లు ధరలు పెరగకపోవడంతో రైతు దివాళా తీస్తున్నారని ఆవేదన చెందారు. రైతును ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పంటలకు మద్దతు ధర ప్రకటించాలని,  స్వామినాథన్ కమిషన్  ప్రతిపాదనలను తక్షణమే అమలు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ ధర్నా లో సంఘం మండల అద్యక్షకార్యదర్శులు తగరం జగన్నాధం, గడ్డం సత్యనారాయణ, సభ్యులు గడ్డం వెంకటేశ్వరరావు, కలపాల భద్రం, సీసం రాముడు తదితరులు పాల్గొన్నారు.