
మండల వ్యవసాయ అధికారిగా గుగులోతు స్వామి శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో పదవి బాధ్యత స్వీకరించారు. గతంలో ఆయన జిల్లా వ్యవసాయ కార్యాలయంలో టెక్నికల్ ఏవో విధులు నిర్వహిస్తు, పెద్దవంగర కు బదిలీ పై వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను ఏఈవో లు, మండల ఫర్టిలైజర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు పగిడిపాల రమేష్, ఉపాధ్యక్షుడు గుంటుక వెంకన్న, గౌరవ అధ్యక్షుడు కొడకంటి నాగరాజు, సభ్యులు జాటోత్ గోపాల్ నాయక్, బొల్లు వీరన్న, దేవసాని దామోదర్, కిరణ్ కుమార్ రెడ్డి, బొమ్మెరబోయిన అనిల్, మన గ్రోమోర్ మేనేజర్ మంచినీళ్ల సురేష్ తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.