
మండలంలోని చలకుర్తి అంగన్వాడీ కేంద్రం లోశనివారం ఐసిడిఎస్ సూపర్ వైజర్ గౌసియా బేగం స్వరక్ష డే,నిర్వహించారు. ఈ సందర్బంగా బాల్యవివాహాలు, బేటీ బచావో,బేటీ పఢావో కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. అంగన్‌వాడీటీచర్ ఆశావర్కలు, గ్రామం లో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికల అక్రమ రవాణా, లైంగిక వేధింపులు, వరకట్న బాధితులను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 181, 100, 1098 టోల్‌ఫ్రీ, హెల్ప్‌లైన్ నెంబర్లు ఆందుబాటులో ఉంచారని తెలిపారు. స్థానికంగా షీ టీం పోలీసులుకూడా అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం యూఐడీఐ కార్డ్స్, మహిళాశిశు సం క్షేమ శాఖ నుంచి గ్రామాల్లోని అర్హులయిన అభ్యర్థులకు అందించామని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ శాంత, ఆయా పద్మ, హెల్త్ సూపర్ వైజర్ రేణుక, ఏఎన్ ఎం చంద్రకళ, ఆశావర్కర్లు కళమ్మ, అంగన్వాడీ లబ్ధిదారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.