చండూరు మున్సిపాలిటీ ప్రజలకు స్వర్గపురి వాహనాన్ని(చనిపోయిన వారిని స్మశాన వాటిక వరకు తీసుకెళ్లే వాహనం) సమకూర్చాలని కోరుతూ చేనేత పరిరక్షణ సేవాసమితి, చేనేత కార్మిక సంఘం, మార్కండేయ యువజన సంఘం ఆధ్వర్యంలో పలువురు మంగళవారం చండూరు మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. మున్సిపాలిటీ తరపున వాహనం లేకపోవడంతో ప్రవేట్ వాహనాన్ని పెట్టుకోవడానికి పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అని తెలిపారు. మున్సిపాలిటీ తరపున వాహన్నాని కొనుగోలు చేయాలని లేదా దాతల సహకారంతో నైనా సమకూర్చాలని వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు. లేకపోతే ప్రవేట్ స్వర్గపురి వాహనానికి అయ్యే ఖర్చులను మున్సిపాలిటీనే భరించాలని వారు కోరారు. బుధవారం జరిగే మున్సిపల్ సమావేశంలో స్వర్గపురి వాహనం ఏర్పాటు పై తప్పక చర్చిస్తామని ఈ సందర్భంగా కమిషనర్ మణికరన్, తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గుంటి వెంకటేశం, పరిరక్షణ సేవా సమితి అధ్యక్షుడు రాపోలు ప్రభాకర్, కార్మిక సంఘం అధ్యక్షుడు తిరందాసు శ్రీను, కర్నాటి శ్రీనివాసులు,ఏలె శ్రీను, రాపోలు వెంకటేశం, సంగెపు శ్రీను, చెరుపల్లి కృష్ణ, గంజి బిక్షం, తిరందాసు నందు, చెరుపల్లి వెంకన్న, వర్కాల విజయ్, చెరుపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.