
అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ అధ్వర్యంలో ఎస్ ఎఫ్ డీ స్టుడెంట్ ఫర్ డెవలప్మెంట్ ఆధ్వర్యం లో, స్వచ్చ్ క్యాంపస్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణలో ప్లాస్టిక్, చెత్తను తీసి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ డీ నాయకులు మాట్లాడుతూ మనమందరం ప్రకృతిని ఎల్లప్పుడూ కాపాడుకోవాలని , మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి ,ప్రకృతిని శుభ్రంగా ఉంచుకుంటే అనారోగ్యం కాకుండా వుంటామని వివరించారు.ఇదే కాకుండా ప్రజలందరూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ డీ జిల్లా కన్వీనర్ ప్రమోద్, యూనివర్సిటీ కన్వీనర్ హరినాథ్ రెడ్డి, ఎబివిపి జాతీయ కార్యవర్గ సభ్యులు శివ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులునాగరాజు, యూనివర్సిటీ ప్రెసిడెంట్ సాయి, సెక్రటరీ అమృత్ చారి, ఉపాధ్యక్షులు, పావని, అనిల్, తరుణ్, జాయింట్ సెక్రటరీలు, హరిక్రిష్ణ, సమీర్, మని, అక్షయ్, సచిన్ నాయకులు సతీష్, సంతోష్, మహార్షి, రాము, అజయ్, శ్రీను, లెనిన్, సాయినాథ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.