
జక్రాన్ పల్లి మండల తోర్లి కొండ గ్రామం గల స్వయంభు శీలా తీర్థ శ్రీ వెంకటేశ్వర నూతన ఆలయ కమిటీ ఎన్నిక శనివారం నిర్వహించారు. ఈ ఆలయ కమిటీ చైర్మన్ గా కాటిపల్లి సాయిరెడ్డి, వైస్ చైర్మన్ గా పుష్పక్, సెక్రెటరీ గాదపెల్లి గంగారం, క్యాషియర్ కుమ్మరి సంతోష్ లను నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన కమిటీ సభ్యులను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు ఉత్కం శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షులు కనక రవి, యువజన విభాగం మండల ఉపాధ్యక్షులు కిషోర్, వినోద్ యువజన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు, యువజన సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది.