వాసవి క్లబ్ – 2025 అశ్వారావుపేట పాలకవర్గం శుక్రవారం స్థానిక కన్యకాపరమేశ్వరి దేవాలయం ప్రాంగణంలో ప్రమాణస్వీకారం చేసింది.
అద్యక్షులు సత్యవరపు బాలగంగాధర్, ప్రధాన కార్యదర్శి సమయమంతుల మోహనరావు, ట్రెజరర్ రావికింద కుమార్ రాజ లతో జెడ్.సీ భోగవల్లి రాంబాబు ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా మాజీ అద్యక్షులు శీమకుర్తి వెంకటేశ్వరరావు, వాసవి క్లబ్ అశ్వారావుపేట మండల మండల పూర్వ అద్యక్షులు జల్లిపల్లి లోక్ నాథ్ గుప్త,ఆర్యవైశ్య మండల అద్యక్షులు చీమకుర్తి శ్రీనివాసరావు, మండల పరిషత్ పూర్వ అద్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి, సమయమంతుల మహేశ్వరరావు,ముత్తా సుమాకర్,కోరుకొండ రామమోహనరావు లు పాల్గొన్నారు.