ఫైనల్లో స్వెటెక్‌

ఫైనల్లో స్వెటెక్‌– ఇండియన్‌వెల్స్‌ ఓపెన్‌
ఇండియన్‌వెల్స్‌ : మహిళల సింగిల్స్‌లో వరల్డ్‌ నం.1, టాప్‌ సీడ్‌ ఇగా స్వైటెక్‌ సత్తా చాటింది. ఇండియన్‌వెల్స్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లోకి స్వైటెక్‌ ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో 31వ సీడ్‌ మార్టాపై 6-2, 6-1తో స్వైటెక్‌ విజయం సాధించింది. ఐదు బ్రేక్‌ పాయింట్లతో చెలరేగిన స్వైటెక్‌ వరుస సెట్లలో విజయం సాధించింది. మరో సెమీఫైనల్లో అమెరికా యువ క్రీడాకారిణి కొకొ గాఫ్‌ నిరాశపరిచింది. 9వ సీడ్‌ మరియ సక్కరి చేతిలో మూడు సెట్ల పోరులో పరాజయం పాలైంది. 4-6, 7-6(7-5), 2-6తో గాఫ్‌ ఓటమి చెందింది. నేడు టైటిల్‌ పోరులో స్వైటెక్‌తో మరియ తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో ఫైనల్లో బెర్త్‌ కోసం జానిక్‌ సిన్నర్‌, కార్లోస్‌ అల్కరాస్‌.. పాల్‌, డానియల్‌ మెద్వదేవ్‌ పోటీపడుతున్నారు.