పాలియేటివ్ కేర్ పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన ఎస్వీఐసీసీఏఆర్

SWICCAR organized an awareness program for palliative careతిరుపతి: టాటా క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వా న్స్‌డ్ రీసెర్చ్ (SVICCAR) (తిరుపతి), ఆంకాలజీలో పాలియేటివ్ కేర్ ముఖ్యమైన పాత్ర గురించి అవగాహన కల్పించ డానికి ఒక విద్యా కార్యక్రమాన్ని నిర్వహించింది. జీవితం చివరి దశలలో సానుభూతి, గౌరవం కనబరిచేందుకు నిస్వా ర్థ నిబద్ధత అనేది గొప్పతనం యొక్క తారస్థాయిగా నిలుస్తుంది. ఈ స్ఫూర్తితో, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్న రోగుల పట్ల కరుణ, సమగ్ర సంరక్షణ  ప్రాముఖ్యతను ఈ కార్యక్రమం నొక్కిచెప్పింది. భారతదేశంలో ప్రతి సంవత్సరం పది లక్షల కంటే ఎక్కువగా కొత్త క్యాన్సర్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. వాటిలో అత్యధికులు వ్యాధి ముదిరిపోయిన దశలలో (III లేదా IV) మాత్రమే వైద్య సంరక్షణను ఆశ్రయిస్తున్నారు. అది వారిని ఉపశమన సంరక్షణ అవసరమయ్యే వారిగా చేస్తోంది. క్యాన్సర్ కేసులు పెరుగుతుండడం, చివరి దశలో వాటిని గుర్తిం చడంతో, సమర్థవంతమైన రీతిలో నొప్పి, ఉపశమన సంరక్షణ సేవలకు డిమాండ్ పెరుగుతోంది. క్యాన్సర్ రోగు లలో పాలియేటివ్ కేర్ అవసరం అయ్యే వారు ప్రతీ  100,000 మందికి 70 నుండి 140 వరకు ఉంటారని అంచనా. అయి నప్పటికీ, భారతీయుల్లో 4% కంటే తక్కువ మందికి మాత్రమే ఈ కీలకమైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉంది. టాటా క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ భారతదేశంలో ఉన్న క్యాన్సర్ కేర్ సవాళ్లను గుర్తిస్తుంది. రోగుల ఇళ్లకు సరసమైన, అధిక-నాణ్యత కలిగిన ఆంకోలాజికల్ సేవలను తీసుకువెళ్లేందుకు తనను తాను అంకితం చేసుకుంది. సమగ్రత, కరు ణ, సంరక్షణతో కూడిన తాత్వికత  విలువలతో మార్గనిర్దేశం చేయబడింది. ఇది దేశమంతటా  ఆరోగ్య సంరక్షణ కేంద్రాల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. రోగి-కేంద్రీకృత విధానాలు, వినూత్న సాంకేతికతను ఉపయోగిస్తోంది. దీని సంరక్షణ నమూనా క్యాన్సర్ లక్షణాల గురించి అవగాహన పెంచడానికి, సకాలంలో స్క్రీనింగ్‌కు తగిన ప్రాముఖ్యతను ఇస్తుంది. ముఖ్యంగా అట్టడుగు స్థాయిలలో, ప్రారంభ దశలోనే గుర్తించడం జరుగుతుంది, ఉపశమన సంరక్షణ అవసరాన్ని తగ్గిస్తుంది. అందుబాటులో ఉన్న, నాణ్యమైన ఉపశమన సంరక్షణ ఆవశ్యకత గురించి  టాటా క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూ టివ్ & టాటా మెమోరియల్ సెంటర్‌  మాజీ డైరెక్టర్, సర్జికల్ ఆంకాలజీ హెడ్ డాక్టర్ రాజేంద్ర ఎ. బద్వే  మాట్లాడుతూ, “70% మంది రోగులలో వ్యాధి ముదిరిన దశలో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ జరుగుతున్న చోట పాలియేటివ్ కేర్‌కు భారతదేశంలో డిమాండ్ పెరుగుతోంది. మనం ఒక ప్రాంతాన్ని, స్థానిక సమాజాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఉప శమన సంరక్షణ వ్యూహాలను రూపొందించాలి, ప్రస్తుత చికిత్స నమూనాలో దాన్ని సజావుగా చేర్చాలి. ఇది రోగుల జీవన నాణ్యతకు సంబంధించి కీలకమైన చిక్కులను కలిగి ఉండవచ్చు – వాస్తవానికి దీన్ని సకాలంలో ప్రవేశ పెట్టిన ప్పుడు రోగి ఆందోళనను 40% తగ్గించవచ్చు. పట్టణ, గ్రామీణ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, క్లినిక్‌లు రెండింటి లోనూ పాలియేటివ్ కేర్‌కు ప్రాప్యతను అభివృద్ధి చేయడం ద్వారా, మెరుగైన జీవన ఫలితాల నాణ్యత నుండి ఎక్కువ మంది ప్రజలు ప్రయోజనం పొందవచ్చు’’ అని అన్నారు.
స్థానిక సమూహాలకు తెలియజేయడం, సాధికారత కల్పించడం లక్ష్యంగా ఇటీవల తిరుపతిలో ఎస్వీఐసీసీఏఆర్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ అవగాహన కార్యక్రమంలో  ప్రాథమిక సంరక్షణ అందించే వాళ్లు, సంరక్షకులు, సాధా రణ ప్రజలు  పాల్గొన్నారు.  వ్యాధి సంబంధిత లక్షణాలను నిర్వహించడంలో, వారి జీవన నాణ్యతను పెంపొందించడం లో క్యాన్సర్, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న రోగులకు పాలియేటివ్ కేర్ ఎలా తోడ్పడుతుందో అర్థం చేసుకునే అవకాశాన్ని ఈ కార్యక్రమం అందించింది. విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, పుట్టపర్తి వంటి కొన్ని కీలక కేంద్రాలలో పాలియేటివ్ కేర్ సేవలను విస్తరించడంలో ఆంధ్రప్రదేశ్ పురోగతి సాధించినప్పటికీ, ఈ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి అటువంటి సంరక్షణ కేం ద్రాలను, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మరింత అభివృద్ధి చేయడం చాలా అవసరం. రాయలసీమతో పాటుగా  తమిళ నాడు, కర్ణాటకలోని పొరుగు ప్రాంతాలలో 24/7 ఉపశమన సహాయాన్ని అందిస్తున్న ఏకైక ఆసుపత్రిగా ఎస్వీ సీసీఏ ఆర్ అనేది స్థానికులకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉంది. డాక్టర్ రవికుమార్, అతని బృందం నేతృత్వం లోని పె యిన్ అండ్ పాలియేటివ్ కేర్ విభాగం ద్వారా శ్రద్ధగల ప్రయత్నాలతో మరింత మంది బాధిత రోగులను చేరుకుంటుంది. ఈ కార్యక్రమంలో, చెన్నైలోని లక్ష్మీ పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, పాలియేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ మల్లికా తిరువదనన్ మాట్లాడుతూ క్యాన్సర్, దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కలిగే శారీరక,  మానసిక క్షోభ ను సమగ్రంగా పరిష్కరిస్తున్న పాలియేటివ్ కేర్‌ను ఎంబీబీఎస్ డిగ్రీలో భాగంగా చేర్చవలసిన అవసరాన్ని ప్రముఖంగా చాటిచెప్పారు. ఇది దేశవ్యాప్తంగా మిలియన్ల మంది వెనుకబడిన ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది.  శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (తిరుపతి) సర్జికల్ ఆంకాలజీ హెడ్ డాక్టర్ నరేంద్ర హులికల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘అధునాతన క్యాన్సర్ లక్షణాలతో సంబంధం ఉన్న ప్రత్యేక చికిత్స అవసరాలను వివరించారు, వీటిని మందులతో నిర్వహించడమే కాకుండా శస్త్రచికిత్స జోక్యం కూడా అవసరం. మింగడంలో ఇబ్బంది, రక్తస్రావం, ఛాతీ, పొత్తికడుపులో ద్రవం చేరడం, ప్రేగు సంబంధ అవరోధం వంటి మరిన్ని లక్షణాల విషయంలో ఇది చాలా ముఖ్యమైం ది’’ అని అన్నారు. చెన్నై అడయార్ లోని క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ కు చెందిన డాక్టర్ వి. సురేంద్రన్ తో సహా ఇతర నిపుణులు  “జీవితానికి రోజుల కంటే రోజులకు జీవితాన్ని జోడించడం”  అనే ఉపశమన సంరక్షణ లక్ష్యాన్ని నొక్కి చెప్పారు. వైద్యులు, నర్సు లు, మనస్తత్వవేత్తలు, ఎన్జీఓలు,  సంరక్షకులతో కూడిన రోగి-కేంద్రీకృత విధానం అవసరమయ్యే ఉపశమన సంరక్షణ అనేది ఒక భాగస్వామయ్య ప్రయత్నమని ఎస్వీఐసీసీఏఆర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ వ్యాఖ్యానించారు. నగరం లో నిర్వహించిన అవగాహన సమావేశాలలో సైకో-ఆంకాలజిస్ట్‌లు, పాలియేటివ్ కేర్ నిపుణులు, వివిధ స్పెషాలిటీలకు చెందిన నిపుణులు ఇదే విధమైన భావాలను వ్యక్తపరిచారు. ఇదే విధమైన అవగాహన కార్యక్రమం రాంచీలో కూడా నిర్వహించబడింది. ఇది దేశవ్యాప్తంగా అవగాహనను వ్యాప్తి చేయడానికి, జీవితాంతం సంరక్షణ సేవలను బలోపేతం చేయడానికి, వైద్య సిబ్బంది, ప్రజలకు అవగాహన కల్పించ డానికి సంస్థకు గల నిబద్ధతను పునరుద్ఘాటించింది.