– జోమాటో బాటలో పెంపు
న్యూఢిల్లీ : జొమాటో బాటలోనే స్విగ్గీ కూడా తన ప్లాట్‌ఫామ్ ధరను పెంచింది. ప్రతి ఆర్డర్‌పైనా రూ.10 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది. ఇంతక్రితం ఇది రూ.7గా ఉంది. పెంచిన ధరలు గురువారం నుంచే అమల్లోకి వచ్చాయని స్పష్టం అవుతోంది. హైదరాబాద్‌లోని ఆర్డర్లపై రూ.10కి పెంచినట్టు బిల్లింగ్‌లో చేర్చేంది.