స్విగ్గీ ఐపీఓ ధరల శ్రేణీ రూ.371-390

ముంబయి : ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ తన ఇనిషీయల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ధరల శ్రేణీని రూ.371-390గా నిర్ణయించింది. యాంకర్‌ ఇన్వెస్టర్ల కోసం నవంబర్‌ 5న ఇష్యూ తెరువనుంది. రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం 6-8 వరకు కొనసాగనున్న ఈ ఇష్యూలో రూ.11,300 కోట్ల నిధుల సమీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ ప్రాసెస్‌కు స్విగ్గీలో 31శాతం వాటా ఉంది. ఎంఐహెచ్‌ ఇండియా ఫుడ్‌ హోల్డింగ్స్‌ రూపంలో వాటాలు ఉన్నాయి. ఇందులో ఐదో వంతు వాటాను ఐపీఓలో భాగంగా విక్రయించే అవకాశాలున్నాయి.