ఈత వనాలు అధికంగా పెంచాలి

ఈత వనాలు అధికంగా పెంచాలి– ఎక్సైజ్‌ సీఐ వెంకటేశం, ఏపీవో రాములు
నవతెలంగాణ-కోడంగల్‌
ఈత వనాలు అధికంగా పెంచాలని కోడంగల్‌ ఎక్సైజ్‌ సీఐ వెంకటేశం, ఏపీవో రాములు అన్నారు. మంగళవారం కొడంగల్‌ మండలం ఆలేడు గ్రామంలో ఈత మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌడ్‌లకు జీవనో పాధి కల్పించేది ఈత, తాటి వనాలేనన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని మీద బీజీగా ఉండే సమయంలో ఈత వనాలు పెంచడం సాధ్యం కాదన్నారు. హరితహారంలో భాగంగా ఈత వనాలను పెంచేందుకు ప్రతి ఒక్కరూ మొక్క నాటి, దాన్ని సంరక్షించాలన్నారు. గతంలో కూడా ఈత మొక్కలను నాటామన్నారు, ఈ కార్యక్రమంలో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ కష్ణ, రాజు, బాలు, దిల్లేశ్వరి, జ్యోతి భవాని, పంచాయతీ కార్యదర్శి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.