
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రీమియం మరియు వినూత్న ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జీవనశైలి బ్రాండ్, స్విస్ మిలిటరీ, దక్షిణ భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు, ట్రావెల్ గేర్ విభాగంలో కొత్త ఎస్ కె యు లను ప్రారంభించినట్లు వెల్లడించింది. స్విస్ మిలిటరీ తమ నూతన ట్రావెల్ గేర్ ఉత్పత్తులను పరిచయం చేయాలనే నిర్ణయం భారతదేశంలోని శక్తివంతమైన మార్కెట్ ద్వారా నడపబడుతుంది. స్విస్ మిలిటరీ యొక్క ఈ వ్యూహాత్మక చర్య భారతీయ వినియోగదారుల యొక్క పెరుగుతున్న ఆకాంక్షలు, ప్రీమియం లగేజ్, ట్రావెల్ గేర్‌ల కోసం పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ఉంటుంది. కొత్త ఉత్పత్తి శ్రేణిలో 8-వీల్ డిజైన్‌లు, అల్యూమినియం ట్రాలీల వంటి ప్రత్యేక స్పెసిఫికేషన్‌లతో వివిధ రంగులలో తొమ్మిది ట్రావెల్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఇవి కార్యాచరణ మరియు సరసమైన ధర పరంగా పరిశ్రమలో నూతన ప్రమాణాలను ఏర్పరుస్తాయి.
స్విస్ మిలిటరీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అనూజ్ సాహ్నీ మాట్లాడుతూ, ” తమ ఆవిష్కరణలు, విస్తరణ ప్రయాణాన్ని స్విస్ మిలిటరీ కొనసాగిస్తున్నందున, మా సరికొత్త శ్రేణి ట్రావెల్ గేర్ ఉత్పత్తులను ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా లక్ష్యం కేవలం మా కస్టమర్ల అంచనాలను అందుకోవటం మాత్రమే కాదు, వాటిని అధిగమించడం, ఈ తాజా కలెక్షన్ అసమానమైన నాణ్యత మరియు కార్యాచరణను అందించడంలో మా అంకితభావాన్ని సూచిస్తుంది…” అని అన్నారు. దక్షిణ భారతదేశంలో స్విస్ మిలిటరీ విస్తరణలో అచలా కమర్షియల్ వెంచర్స్ వంటి రిటైలర్‌లతో కీలకమైన భాగస్వామ్యాలు తోడ్పాటు వుంది. “దక్షిణ భారతదేశంలో మా కార్యకలాపాలను విస్తరించడం అనేది ఈ ప్రాంతంలో మా కస్టమర్‌లకు సేవలందించాలనే మా నిబద్ధతలో ఒక కీలకమైన ముందడుగు. హైదరాబాద్, చెన్నై మరియు త్రివేండ్రంలో మా ప్రస్తుత కార్యకలాపాలతో , దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాలలో మా పరిధిని విస్తరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము” అని స్విస్ మిలటరీ, మేనేజింగ్ డైరెక్టర్,అనుజ్ సాహ్ని అన్నారు.