ఉత్తమ పని ప్రదేశంగా సింక్రోనీ

హైదరాబాద్‌ : ఉత్తమ పని ప్రదేశాల్లో ప్రీమియర్‌ కన్స్యూమర్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంపెనీ సింక్రోనీ దేశంలోనే అత్యుత్తమ కంపెనీలలో రెండవ స్థానంలో నిలిచింది. సిబ్బందికి సానుకూల పని కేంద్రంగా ఈ అవార్డును ‘ది గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌’ ఇన్స్‌ట్యూషన్‌ నుంచి వరుసగా ఏడవ సంవత్సరం సాధించినట్లు సింక్రోనీ ఇండియా హెడ్‌ రచనా బహదూర్‌ పేర్కొన్నారు. తమ సంస్థలో ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని సృష్టించడం, అందరికీ ఒకే స్థాయిలో ప్రోత్సాహం ఉంటుందన్నారు.
సింక్రోనీలో 51 శాతం పైగా మహిళ ఉద్యోగులతో పాటుగా, 106 మంది వైకల్యం వ్యక్తులు, 50 శాతం పైగా నిపుణులు తమ కార్యాలయంలో పని చేస్తున్నారన్నారు.