టీ20 క్రికెట్‌ చాంప్‌ మార్షల్‌

టీ20 క్రికెట్‌ చాంప్‌ మార్షల్‌హైదరాబాద్‌ : 5వ ఐఐపీపీఎల్‌ టీ20 క్రికెట్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను టీమ్‌ మార్షల్‌ సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన ఫైనల్లో టీమ్‌ రాయల్‌పై మార్షల్‌ 14 పరుగులతో గెలుపొందింది. తొలుత 20 ఓవర్లలో 129/8 పరుగులు చేయగా.. రాయల్‌ 20 ఓవర్లలో 115/7 పరుగులకే పరిమితమైంది. 199 పరుగులు, నాలుగు వికెట్ల ప్రదర్శనతో అబ్దుల్‌ మునీర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. ప్రవీణ్‌ కుమార్‌, విజరు కుమార్‌లు విజేతలకు బహుమతులు అందజేశారు.