‘ఏషియన్ పెయింట్స్ వేర్ ద హార్ట్ ఈజ్’ సీజన్ 8 తాజా ఎపిసోడ్‌లో తాప్సీ పన్ను

నవతెలంగాణ హైదరాబాద్: అది ఒక అందమైన ఇల్లు. ఇల్లు అనడం కంటే‌ అది ఒక‌ ఇంద్రభవనం అనడం సబబు ఏమో? ఎందుకంటే, ఆ ఇంట్లో ప్రతి మూల ఎంతో అందంగా తీర్చిదిద్దబడింది. చూడటానికి రెండు కళ్లు చాలవు, అంత బాగుంటుంది. ఆ ఇంటిని చూస్తే మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇంతకీ ఆ ఇల్లు ఎవరిది అనే ప్రశ్నే కదా! ఆ ఇల్లు ప్రముఖ బాలివుడ్ సినీ నటి తాప్సీది. ‘ఏషియన్ పెయింట్స్ వేర్ ద హార్ట్ ఈజ్’ సీజన్ 8 తాజా ఎపిసోడ్‌లో తాప్సీ పన్ను తన ముంబయి ఇంటి తలుపులు తెరిచింది. తన ప్రత్యేక ప్రపంచాన్ని చూపించారు. తెరపై ఎన్నో పాత్రలతో ప్రేక్షకుల మనస్సు దోచుకున్న ఆమె తన ఇంటిని తన వ్యక్తిత్వానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. ఈ ఇల్లు ఆమె వ్యక్తిత్వాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తుంది.

ముంబయిలో ఉన్న ఆ ఇంటి ప్రత్యేకతే వేరు. అది కేవలం ఒక ఇల్లే కాదు, ఆమె కుటుంబ మూలాలు, ఆత్మను ప్రతిబింబిస్తుంది. ‘ఇల్లు అనేది నా కుటుంబం ఉన్న చోటు. నేను నా చెల్లితో చాలా దగ్గరగా ఉంటాను. ఆమె ఎక్కడ ఉంటే అదే నా ఇంటిగా భావిస్తాను’ అని తాప్సీ చెప్పింది. ఆమె చెల్లి కూడా జీవితంలో ఒక భాగం. ఢిల్లీ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి ముంబయి వరకు ఆమె ప్రయాణం ఎంతో ఉత్తేజకరంగా ఉంటుంది. అక్కా చెల్లెలు బంధం తన తండ్రి చాచా మధ్య ఉన్న సాన్నిహిత్యానికి ప్రేరణగా నిలిచింది. తాప్సీ చిన్నప్పుడు రెండు పడక గదుల అపార్ట్‌మెంట్‌లో జీవితం గడిపేది. ఆ ఇంట్లో ఎనిమిది మంది కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న రోజులు, వ్యక్తిగత స్థలానికే లోటు ఉన్నా.. ఆనందంగా ఎలా ఉండాలో నేర్పింది. ఈ అనుభవం ఆమె వ్యక్తిగత స్థలంపై ఉన్న ఆరాధనను పెంచింది. దీంతో ఏకాంతాన్ని, స్నేహబంధాల కోసం స్థలాన్ని సమతుల్యంగా కలిగించే ఇంటిని రూపకల్పన చేయడానికి ప్రేరణ ఇచ్చింది. రెండు అంతస్థులు కలిగి ఉన్న ఈ ఇల్లు ఆ దృష్టికోణాన్ని అద్భుతంగా ప్రతిఫలిస్తుంది.

ఇంట్లో అడుగు పెట్టగానే‌ తాప్సీ చలాకీతనంతో నిండిన హాస్యం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ‘యూ లుక్ నైస్ టుడే’, ‘ప్రిటెండ్ దిస్ ఈజ్ ఏ హవేలీ’ వంటి సందేశాలతో వెల్కమ్ మ్యాట్స్, సంతోషకరమైన, సాన్నిహిత్యమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఇంట్లో ప్రతి మూలా ఒక కథ చెబుతుంది. ‘నా ఇల్లు నిజంగా ఒక వరల్డ్ టూర్‌లా ఉంటుంది’ అని తాప్సీ చెప్తుంది. ఆమె గ్లోబల్ ట్రావెల్స్‌ నుంచి సేకరించిన డెకర్, కళాఖండాలను చూపిస్తూ ఈ మాటలు అన్నారు. మెట్లు ఎక్కినప్పుడు యూరప్ నాజూకు గౌరవం నుంచి భారతీయ ఆకర్షణకు మార్పు అనుభవించవచ్చు. యూరోప్ థీమ్‌తో ఉన్న కింద అంతస్తులో తన ప్రయాణాల నుంచి తెచ్చిన సావనీర్స్‌ను ఆమె ప్రేమగా ‘ఏషియన్ పెయింట్స్ కి వాల్’ అని పిలిచే ప్రత్యేక ఫీచర్‌పై ప్రదర్శిస్తుంది. వివిధ రంగుల్లో ఉన్న బోల్డ్ స్ట్రిప్స్‌తో అలంకరించిన ఈ గోడ కలర్ స్వాచ్ బుక్‌లాగా కనిపిస్తుంది. మీకు ఇష్టమైన రంగును ఎంచుకునేందుకు ఆహ్వానిస్తుంది.

పైన ఉన్న భారతీయ థీమ్ అంతస్తులో తన పంజాబీ మూలాలు కనిపిస్తాయి. ప్రేమగా ‘పన్ను పింద్’ అని పిలుస్తుంది. డిజైన్‌లో టెక్స్చర్డ్ గోడలు, ఎక్స్‌పోజ్డ్ బ్రిక్, చెక్క పనితో చేసిన ప్యానెలింగ్ వంటి ప్రత్యేకతలతో పాటు మట్టిరంగుల టోన్లు ఉపయోగించబడి, గ్రామీణ, సాన్నిహిత్య వాతావరణాన్ని సృష్టించాయి. ఈ అంతస్తు మొత్తాన్ని సంపన్నంగా చూపించే ప్రధాన అంశాలు, పొడవైన కిటికీలకు చెక్కతో రూపొందించారు. ఎంతో శ్రద్ధగా చెక్కబడిన ఫ్రేమ్స్, అద్దపు కళాఖండాలు ఉన్నాయి. హస్తకళతో చేసిన ఫర్నిచర్, ఫుల్కారి అప్‌హోల్స్టరీ, ఆమె జీవిత కథను చెప్పే వ్యక్తిగత వార్లీ ఆర్ట్ గోడ వంటి హస్తకళ ఇంటికి మరింత ప్రత్యేకతను తెచ్చాయి. ఒక గోడపై, స్త్రీ బలం, గౌరవాన్ని కొనియాడే గురు గ్రంథ్ సాహిబ్ నుంచి ఒక కొటేషన్ ప్రత్యేకంగా అలంకరించింది. దీనిపై తాప్సీ చెబుతూ.. ‘రాజులకు జన్మనిచ్చే స్త్రీని మీరు ఎలా తక్కువగా చూడగలరు?’ అంటూ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

మొక్కలపై తన ప్రేమను ప్రతిబింబించేలా ఆమె ఇంటి మొత్తం 137 మొక్కలను పెట్టారు. అవకాడో మొక్క ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇంట్లో తాటి చెక్కను విస్తృతంగా ఉపయోగించారు. ఇది గ్రామీణ భారతీయ ఇళ్లలో కనిపించే సహజ దృశ్యాన్ని గుర్తు చేస్తుంది. ఆమె చెల్లి శగున్ పన్ను, ఒక విలువైన డెకర్ సూచన ఇస్తూ ‘ముందుగా గోడలు, పైకప్పును ప్లాన్ చేయాలి. అవి పూర్తయ్యాక, మిగతావన్నీ సహజంగా సక్రమంగా ఉంటాయి’ అని చెప్పారు. ఈ ఎపిసోడ్ తాప్సీ డిజైన్ చాతుర్యాన్ని మాత్రమే కాకుండా వ్యక్తిగత, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించే ఆమె తత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ‘నా ఇంటి గోడలు మాట్లాడగలిగితే, ‘నా దగ్గరికి రా’ అని చెబుతాయి. ఎందుకంటే, నేను రోజూ తెరపైకి తిరిగి రావాలనిపించేలా, ఆత్మీయతతో, ప్రత్యేకతతో నిండిన ఇల్లు తీర్చిదిద్దాను’ అని తెలిపారు. తాప్సీ సృజనాత్మకతతో ప్రేరణ పొందిన వారికి ఏషియన్ పెయింట్స్ వేర్ ద హార్ట్ ఇస్ BeautifulHomes.comలో ఒక స్టైల్ గైడ్ అందిస్తుంది. దీని ద్వారా ప్రేక్షకులు తమ ఇళ్లలో