విలక్షణ నటుడు రావు రమేష్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. ఈ చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. దర్శకుడు సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలోహొపీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై రూపొందిన చిత్రానికి బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలుగా వ్యవహరించారు.
అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించిన ఈ చిత్రం ఈనెల 23న విడుదలైంది. సినిమాకు మంచి రివ్యూలు, ఆడియెన్స్ నుంచి మంచి మౌత్ టాక్ రావడంతో యూనిట్ అంతా సక్సెస్ సెలెబ్రేషన్స్‌ను చేసుకుంది. ఈ క్రమంలో శనివారం నిర్వహించిన థ్యాంక్స్ మీట్ ఈవెంట్‌లో తబితా సుకుమార్ మాట్లాడుతూ, ‘నన్ను నమ్మి నాకు సపోర్ట్‌గా నిలిచిన నా భర్త సుకుమార్‌కి థ్యాంక్స్. రామ్ చరణ్, ఉపాసన, అల్లుఅర్జున్, సమంత, స్వప్నా దత్, రష్మిక, నవీన్ పొలిశెట్టి వంటి వారు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇండిస్టీ అంతా ఫ్యామిలీలా మాకు సపోర్ట్‌గా నిలిబడింది. మైత్రీ శశి, హరి, రవి, అశోక్, శ్రీనివాస్, వేమ ఇలా అందరూ నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. మా సినిమాకు వస్తున్న ఫలితాన్ని చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను ఏం ఊహించానో అదే నిజమైంది. నా జడ్జ్‌మెంట్ కరెక్ట్ అని చెప్పిన ఆడియెన్స్ అందరికీ థ్యాంక్స్’ అని అన్నారు.
డైరెక్టర్ లక్ష్మణ్ కార్య మాట్లాడుతూ, ‘మా చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. టికెట్లు సేల్ అవుతున్నాయి. షోలు హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఫ్యామిలీ అంతా వచ్చి హాయిగా నవ్వుకుని వెళ్లేలా సినిమా ఉంటుంది’ అని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్, కథానాయిక రమ్య పసుపులేటి, హీరో అంకిత్ కొయ్య, లైన్ ప్రొడ్యూసర్ శ్రీహరి, నటి ఇంద్రజ తదితరులు ఈ చిత్ర విజయంపై తమ ఆనందం వ్యక్తం చేశారు.
మా సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. జనాలు థియేటర్లకు వస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. మిడిల్ క్లాస్ స్క్రిప్ట్ ఎంచుకోవడం తప్పా? అని అనుకున్నాను. మిడిల్ క్లాస్ ఎక్కువగా కాంప్రమైజ్ అవుతుంది. వాళ్లను కించపర్చకుండా ఈ సినిమాను లక్ష్మణ్ గొప్పగా తీశాడు. అలాగే అన్ని పాత్రలను అద్భుతంగా రాశారు. ఈ సినిమా బ్యూటీ అదే. కళ్యాణ్ ఈ సినిమాకు మంచి మ్యూజిక్, ఆర్‌ఆర్ ఇచ్చారు.
– రావు రమేష్