హైదరాబాద్ : జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నీ ఆదివారం ప్రారంభమైంది. మోయినాబాద్‌లోని ఫైర్‌ఫాక్స్ స్పోర్ట్స్ అండ్ రిసార్ట్స్ వేదికగా ఈ టోర్నీ మొదలైంది. తెలంగాణ అమ్మాయి అపర్ణ వెల్లూరి ముందంజ వేసింది. 11-7, 11-6, 9-11, 11-9తో బెంగాల్ అమ్మాయిపై అపర్ణ గెలుపొందింది. ఏపీ అమ్మాయి మానస్వి సీలం సైతం రెండో రౌండ్లో అడుగుపెట్టింది. ఉత్తరప్రదేశ్ అమ్మాయిపై 3-2తో ఐదు సెట్ల మ్యాచ్‌లో గెలుపొంది టోర్నీలో ముందంజ వేసింది. ఆరు రోజుల జాతీయ ర్యాంకింగ్ టోర్నీలో దేశవ్యాప్తంగా 1900 మంది క్రీడాకారులు పోటీపడుతున్నారు.