తాడి కార్పొరేషన్ చెక్కు అందజేత

నవతెలంగాణ – వలిగొండ రూరల్

మండల పరిధిలోని వెలువర్తి గ్రామానికి చెందిన పరకాల స్వామి గౌడ్ తాటి చెట్టు ఎక్కుతూ ఇటీవల మోకుజారి కింద పడడంతో వారికి వైద్య ఖర్చుల నిమిత్తం తాడి కార్పొరేషన్ నుండి మంజూరైన రూ.15000 రూపాయల చెక్కును బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి యాదయ్య మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు రాగిరు కిష్టయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, వలిగొండ మండల కోశాధికారి పలుసం స్వామి, గ్రామ నాయకులు పరకాల వెంకటేశం గుండు శేఖర్, పరకాల దశరథ తదితరులు పాల్గొన్నారు.