తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరణ

– భూపాలపల్లి జిల్లా ఇంచార్జి డిసిఓ శైలజా
నవ తెలంగాణ- మల్హర్ రావు: ఎట్టకేలకు తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము చైర్మన్ గా  చెప్యాల రామారావు కు బాధ్యతలు అప్పజెప్పినట్లుగా భూపాలపల్లి ఇంచార్జి డిసిఓ శైలజా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు చేపట్టిన రామారావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు రానున్న సంవత్సరం కాలంలో సొసైటీ ని అభివృద్ధికి కృషి చేస్తూ జిల్లాలోనే ఆదర్శంగా నిలిసేలా చేస్తామన్నారు. రైతులకు రుణాలు, ఎరువులు సకాలంలో అందిస్తామన్నారు. సిబ్బంది తప్పిదంతో  సంవత్సరం కాలంపాటు సస్పెన్షన్ లో ఉన్నట్టుగా గౌరవ కోర్టు ఉత్తర్వులతో బుధవారం తిరిగి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినట్లుగా ప్రకటించారు.