
నవతెలంగాణ – మల్హర్ రావు
తక్షణమే తాడిచెర్ల నుంచి కిషన్ రావు పల్లి పారెస్ట్ మీదుగా భూపాలపల్లి జిల్లా కేంద్రం వరకు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని మాజీ జెడ్పిటిసి గొనె శ్రీనివాసరావు, తాడిచెర్ల మాజీ ఎంపీటీసీ రావుల కల్పన మొగిలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం మండల కేంద్రమైన తాడిచెర్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు తమ నాయకుడు మంథని మాజీ ఎమ్మెల్యే,బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి పుట్ట మధుకర్ మంథని టూ తాడిచేర్ల రోడ్డు పూర్తి చేసి తాడిచేర్ల-ఖమ్మంపల్లి మానేరుపై వంతెన నిర్మించి, తాడిచెర్ల టూ కిషన్ రావు పల్లి వరకు రోడ్డు పూర్తి చేసి, ప్రజల సౌకర్యర్థం ఫారెస్ట్ అనుమతులు తీసుకొచ్చినట్లుగా తెలిపారు. గత ఎన్నికలలో ప్రస్తుత ఎమ్మెల్యే, మంత్రి, కాంగ్రెస్ మాజీ ప్రజాప్రతినిధులు తాడిచెర్ల టూ భూపాలపల్లి రోడ్డు పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ప్రజలను నమ్మించి వాళ్ళ ఓట్లతో గెలిచి 14నెలలు కావస్తున్నా ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు.రోడ్డు నిర్మాణం పూర్తయితే పుట్ట మధుకర్ కు పేరు వస్తదనే దురుద్దేశంతో ఇంకా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.సుమారుగా రూ.కోట్లు వెచ్చించి తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని,లేనియెడల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధపు వాగ్దానాలను ప్రజాక్షేత్రంలో ఎక్కడికక్కడ ఎండకడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు జాగరి హరీష్,మాజీ మండల అధ్యక్షుడు తాజాద్దీన్,మాజీ సర్పంచ్ సుంకరి సత్తయ్య,నాయకులు అన్నమనేని మధుసూదన్ రావు, నారా రమేశ్, మల్క రాజేశ్వరరావు, నార సమ్మయ్య, బోంతల రమేశ్, మల్క కిషన్,కామ శంకర్, తిక్క వినయ్ పాల్గొన్నారు.