సోషల్ టాలెంట్ టెస్ట్ లో తాడిచెర్ల విద్యార్థికి ద్వితీయ బహుమతి

నవతెలంగాణ – మల్హర్ రావు
భూపాలపల్లి జిల్లా స్థాయిలో నిర్వహించిన సోషల్ టాలెంట్ టెస్ట్ లో మండల కేంద్రమైన తాడిచెర్లలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న రామిడి అనూషకు ద్వితీయ బహుమతి గెలుపొందినట్లుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్కా భాస్కర్ రావు తెలిపారు. కాగా అనూష సోషల్ టాలెంట్ టెస్ట్ మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి జిల్లాకు ఎంపికయినట్లుగా తెలిపారు. సోషల్ సబిజెక్టు ఉపాధ్యాయురాలు స్వర్ణలతతో కలిసి అనూష బహుమతి అందుకున్నారు.