
నవతెలంగాణ- శంకరపట్నం
క్రీడలకు పుట్టినిల్లు తాడికల్ అని మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ అన్నారు. ఆదివారం శంకరపట్నం మండల పరిధిలోని తాడికల్ గ్రామంలో ఖో ఖో, కబడ్డీ, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్ రెజ్లింగ్ హత్యాపత్య క్రీడల్లో రాష్ట్ర జాతీయస్థాయిలో ఆడిన క్రీడాకారులు నిర్వహించిన టగ్ ఆఫ్ వార్ క్రికెట్ పోటీల ముగింపు సమావేశంలో విజేతలకు బహుమతులు ఎమ్మెల్యే అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,తాడికల్ జిమ్ సెంటర్ కొరకు 5 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. క్రీడలు స్నేహ సంబంధం పాటు వ్యక్తిలో మానసిక ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసిలు లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శేఖర్ గౌడ్, రవీందర్ రెడ్డి, శంకరపట్నం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంట మహిపాల్. ఎస్సై లక్ష్మారెడ్డి, తాడికల్ సర్పంచ్ కీసర సుజాత సంపత్. ఎంపీటీసీ బుద్ధార్తి వరలక్ష్మి సంపత్. మాజీ సర్పంచ్ దొంగల విజయ రాములు,తాడికల్ సీనియర్ క్రీడాకారులు యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు.