
నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన సంకే పల్లవి అనే విద్యార్థిని ఐఐటీ బొంబాయి ఎంటెక్ ఇన్ టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్, గేట్ ఓవరాల్ రాంక్ 104 సాధించి సీటు సంపాదించింది. ఆమె పేద విద్యార్థి కావడంతో సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న స్థానిక పోలీసులు ఏఎస్ఐ చింత నారాయణ, మిగతా పోలీసులు అందరు కలిసి స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 15 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఉన్నత చదువులకు పేదరికం అడ్డురాకూడదని తెలిపారు. చదువుకోలేనని నిస్సృహలో ఉన్న తనకు ఆర్థిక సహాయం చేసిన తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, ఏఎస్సై నారాయణ మరియు మిగతా పోలీసులకు విద్యార్థిని పల్లవి కృతజ్ఞతలు తెలిపారు.