బదిలీ పై వెళ్లిన తహశీల్దార్ అరెస్ట్..?

– అనంత పల్లికి చెందిన అక్రమ భూ పట్టా కారణమే..!
నవతెలంగాణ – చందుర్తి
నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో ఓ రైతు భూమిని అక్రమ పట్టా చేయడం తో ఓ తహశీల్దార్ కటకటాల పాలయ్యాడు. దీంతో వారిని అరెస్టు కూడా చేసారు.  గతంలో చందుర్తి తహశీల్దార్ గా పని చేసిన నరేష్ ను అనంత పల్లి గ్రామానికి చెందిన  గంగయ్య,వేణు,నవీన్ అదే గ్రామానికి చెందిన సలేంద్ర మల్లేశం అనే  రైతు కు చెందిన భూమిని అక్రమ పట్టా చేసుకున్నారని గత రెండు సంవత్సరాల కిందట కోర్టు ఆశ్రయించిండు. ఈ క్రమం లో అక్రమ పట్టా చేసారని బాధితుని మల్లేశం కుకోర్టు తీర్పు ఇవ్వగా అక్రమాదారుల ను విచారించి అరెస్ట్ చేయాలని కోర్టు నుండి ఆదేశాలు రావడంతో శుక్రవారం వారిని స్టేషన్ ను కు తీసుకెళ్లి అరెస్ట్ చేసినట్లుగా తెలిసింది. దీని పై సిఐ వెంకటేశ్వర్ల ను వివరణ కోరగా తహశీల్దార్ ను విచారిస్తున్నామని తెలిపారు.