
పెరల్స్ కంపెనీకి చెందిన భూములేనని గురువారం తహశీల్దార్ శ్రీదేవికి వినతి పత్రం అందజేసి పెరల్స్ కంపని సభ్యులు మాట్లాడారు. గత 30 సంవత్సరాల క్రితం అమ్ముకున్న భూములను మళ్లీ మాకే కావాలనడం హాస్యాస్పదంగా ఉందని పీఏసీఎల్ ఇన్వెస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లు రవీందర్ రెడ్డి అన్నారు. మండలంలో 1993- 94 సంవత్సరంలో వంజర, తాండ్ర, కంకట, వైకుంఠాపూర్, చింఛోలి గ్రామాలలో సుమారు 500 ఎకరాల పైబడి వ్యవసాయ భూములను పిజిఎఫ్ పిఎసిఎల్ (పెరల్స్) కంపెనీలు కొనుగోలు చేశాయని అప్పటినుండి కంపెనీ సాగు చేస్తుందని అట్టి భూములను 2016 సంవత్సరంలో గౌరవ లోధా కమిటీ ఆధీనంలో భూములు ఉన్నాయని, సుప్రీం కోర్టు, సిబిఐ, లోధా కమిటీ అబ్జర్వేషన్ లోనే దేశవ్యాప్తంగా వేల ఎకరాల భూములు ఉన్నాయని వినతి పత్రంలో పేర్కొన్నమన్నారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎల్ ఇన్వెస్టర్ వెల్పర్ అసోసియేషన్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కొత్త శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకల సైదులు, కోశాధికారి గుండెబోయిన వెంకటేశ్వర్లు సభ్యులు ఎం. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.