నవతెలంగాణ రెంజల్
రెంజల్ మండలం నీలా గ్రామ శివారులో అక్రమ ఇసుక డంపులను తహశీల్దార్ శ్రవణ్ కుమార్ గుర్తించి సీజ్ చేశారు. అంగర్గా పరిసర ప్రాంతాల నుంచి సుమారు 20 ట్రాక్టర్ల అక్రమ ఇసుకను రోడ్డు ఇరు ప్రక్కల డంపులు వేయడంతో వాటిని గుర్తించి సిబ్బందికి అప్పగించారు. బోధన్ రూరల్ సిఐ విజయబాబు ఆదేశాల మేరకు పోలీసులు సైతం తాసిల్దార్ తో సంఘటన స్థలానికి వెళ్లారు. ప్రభుత్వం గుర్తించిన పనులకు ఇట్టి ఇసుకను సరఫరా చేయడానికి రెవెన్యూ సిబ్బందిని కాపలావించారు.