ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే ఆయుధం అని తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ అన్నారు.ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరి జన్మహక్కు అని పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి యువతీ,యువకులు ఓటు హక్కును పొందాలని తహశీల్దార్ కృష్ణప్రసాద్ యువతీ యువకులకు పిలుపునిచ్చారు.నీతి, నిజాయతీ గల పాలకులను ఎన్నుకుంటే నే ప్రజాపాలన సౌలభ్యం ఉంటుందని తెలిపారు.శనివారం 15 వ జాతీయ ఓటరు దినోత్సవం వేడుకలను మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటు యోక్క ప్రాదాన్యతను తెలుపుతూ విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.పట్టణంలో విద్యార్థులు,అధికారులు ప్రదర్శన నిర్వహించి ప్రధాన కూడలి లో మానవహారం నిర్వహించారు.అనంతరం స్థానిక జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులకు ప్రత్యేక బహుమతులను తహశీల్దార్ చేతులమీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం.ఈ.ఓ ప్రసాదరావు,ఎస్సై రామ్మూర్తి, హెచ్ఎం పి హరిత తో పాటు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.