నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం ధోరణి లో పెండింగ్ ఉన్న దరఖాస్తులను ఈ నెల 1 నుండి 9 తేదీ వరకు నిర్ణీత కాలం లో పరిశీలించి పరిష్కరించాలని తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ కార్యాలయం సిబ్బంది కి ఆదేశించారు. ఆయన రెండో సారి తహశీల్దార్ గా శనివారం విధుల్లో చేరిన అనంతరం సిబ్బంది తో సమావేశం అయ్యారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి,ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి?జఠిలం అయినవి ఎన్ని?అనే విషయాలను చర్చించారు.క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు.ఈ సమావేశంలో డి.టి సుచిత్ర రేనా,సూపరింటెండెంట్ ప్రభాకర్ రావు,ఆర్.ఐ లు పద్మ,క్రిష్ణ తదితరులు ఉన్నారు.