తహసీల్దార్ పదవి విరమణ సన్మాన సభ…..

నవతెలంగాణ – బజార్ హత్నూర్: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో గుంజల శంకర్ గత కొన్ని రోజుల నుంచి తహసీల్దార్ గా విధులు నిర్వహించి శుక్రవారం పదవి విరమణ పొందడంతో వారికి స్థానిక పద్మావతీ కళాశాలలో ఎంపీ గోడం నగేష్, అడిషనల్ కలెక్టర్ కే సామల దేవి, ఆర్డిఓ వినోద్ కుమార్లు కార్యక్రమానికి హాజరై పదవి విరమణ పొందిన గుంజల శంకర్ సన్మాంచారు. ఈ కార్యక్రమానికి పలు మండల తహసీల్దార్లు మండల నాయకులు హాజరై మాట్లాడారు. మండలంలో గత కొన్ని రోజుల నుంచి విధులు నిర్వహించిన తహసీల్దార్ ప్రజలకు, రైతులకు అందుబాటులో ఉండి వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూశారు. దీంతో ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ప్రజలకు సేవల అందించిన అధికారులకు ప్రజల గుండెలో గుర్తు ఉంచుకుంటారని అన్నారు. అదే విదంగా ఉద్యోగ విరమణ పొందిన శంకర్ కుటుంబ సభ్యులతో గడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ జల్కె పాండురంగ్, బిఆర్ఎస్ పార్టీ యూత్ కన్వీనర్ డుబ్బుల చంద్ర శేఖర్, నాయకులు చిల్కూరి భూమన్న, నానం రమణ, అల్కె గణేష్, కొత్త శంకర్, మేకల వెంకన్న,  రెవెన్యూ సిబ్బంది ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.