తాసిల్దార్ రాజు కు సమ్మె నోటీస్ అందజేత

– టిఆర్సిపిటియు యూనియన్ నెల్లికుదురు మండల అధ్యక్షుడు సుధా గాని ఉపేందర్ గౌడ్
నవతెలంగాణ – నెల్లికుదురు
తెలంగాణ రాష్ట్ర మోటర్  ట్రాన్స్పోర్ట్ వెహికల్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుమేరకు ఈనెల 16 వ తేదీన సమ్మె కొనసాగిస్తామని శనివారం  స్థానిక తాసిల్దార్ కోడి చింతల రాజుకి  వినతి పత్రం అందించినట్లు టిఆర్సిపిటియు (TRCPTU) యూనియన్ నెల్లికుదురు మండల యూనియన్  ఆధ్యక్షుడు సుదగాని ఉపేందర్ గౌడ్ ప్రధాన కార్యదర్శి నేరెళ్ల ప్రవీణ్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం 2019 అండ్ హిట్ అండ్ రన్ వన్ టు సెక్షన్ రద్దు చేయాలని మోటార్ కార్మికులకు తగిన విధంగా న్యాయం చేయాలని రవాణ సంక్షేమ కార్మిక చట్టాన్ని ఏర్పాటు చేయాలని డ్రైవర్లను నష్టపోకుండా ఆదుకోవాలని కోరుకుంటున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి గుండెబోయిన అశోక్.సభ్యులు మహబూబ్ అలీ, గంధం వెంకటేష్, ఆకుల ప్రభాకర్, దొంతుల పుల్లయ్య, సింగారం ప్రసాద్, తోట నవీన్, గంధసిరి వెంకన్న, సభ్యులు పాల్గొన్నారు.