(నవతెలంగాణ స్పందన )
నవతెలంగాణ-భిక్కనూర్ : ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కు బ్రోకర్లు డబ్బులు వసూలు చేస్తున్నారని నవతెలంగాణ దినపత్రికలో ” ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ దందా ” కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. కథనానికి స్పందించిన భిక్కనూర్ తాసిల్దార్ శివ ప్రసాద్ రెవెన్యూ కార్యాలయంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకొస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తే కఠినమైన చర్యలు తప్పవని, ఎవరైనా డబ్బులు తీసుకుంటే తాసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ధ్రువపత్రాలు ఇస్తామని డబ్బులు వసూలు చేస్తున్న బ్రోకర్లను నమ్మవద్దని మీసేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకున్న పత్రాల కొరకు తాసిల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.