తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు..

Grand Republic celebrations at Tehsildar office..నవతెలంగాణ – మద్నూర్

దేశవ్యాప్తంగా జరుపుకున్న 76వ గణతంత్ర దినోత్సవంలో భాగంగా మద్నూర్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట పోలీస్ గౌరవ వందనాలు మధ్య గణతంత్ర వేడుకలను తాసిల్దార్ ఎండి ముజీబ్ ఘనంగా నిర్వహించారు. కార్యాలయం ఎదుట జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ వేడుకల్లో మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్ ఇతర ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ శాఖల అధికారులు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.