– సీపీఐ(ఎం) చేవెళ్ల డివిజన్ కన్వీనర్ అల్లి దేవెందర్
నవతెలంగాణ-షాబాద్
మండల పరిధిలోని నాగర్‌కుంట గ్రామ సమీపంలో ఉన్న తాజ్ ఫౌల్ట్రీ ఫామ్‌ను ఇక్కడి నుంచి తొలగించాలని సీపీఐ(ఎం) చేవెళ్ల డివిజన్ కన్వీనర్ అల్లి దేవెందర్ అన్నారు. మంగళవారం గ్రామస్తులతో కలిసి తహసీల్దార్ అన్వర్‌కు వినతిప్రతం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాజ్ ఫౌల్ట్రీ ఫాం నుంచి తీవ్రమైనన దుర్వాసన రావడంతో ఈగలు గ్రామంలోకి వస్తున్నా యని, దీంతో గ్రామస్తులు అనారోగ్యంతో బాధ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా చిన్న పిల్లలు, వృద్ధులకు వాంతులు, విరోచనాలకు గురవు తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫౌల్ట్రీ యాజ మాన్యంతో మాట్లాడి షౌల్ట్రీ ఫామ్‌ను ఇక్కడి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేనియేడలా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఫౌల్ట్రీ ఫాం ఎదుట ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నరసింహా, ముంరళీ, రఘురాం, శ్రీధర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.