– నేదునూరు మోడల్ స్కూల్ విద్యార్థుల కష్టాలు
– వానొస్తే రోడ్డంతా చిత్తడే చిత్తడి
– నడవడానికి పనికిరాకుండా మట్టి రోడ్డు
– ప్రతిరోజూ విద్యార్థుల నరకయాతన
– పట్టించుకునే నాథుడే లేడు
నవతెలంగాణ-కందుకూరు
మండల నేదునూరు గ్రామంలో తెలంగాణ మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉన్నాయి. ఈ పాఠశాలల్లో సుమారుగా 12 వంద ల పైబడి విద్యార్థులు చదువుతున్నారు. అయితే, నేదునూ రు, బాచుపల్లి గ్రామాల కు వెళ్లే రహదారి ఆనుకొని ఈ పాఠశాలలకు విద్యార్థులు వెళ్లడానికి మట్టి రోడ్డు ఉంది. గత టవారం 10రోజుల నుండి నిత్యం వర్షం, ముసురు రావడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లే రహదారి బురద, గుంతల మయంగా ఉన్నాయి. వరి నాట్లు వేసే బురద గా మారింది. ప్రతి ఎన్నికల సమయంలో ఎంతోమంది పాలకులు వచ్చి, పాఠశాలకు రోడ్డు చేయిస్తామని ఉత్తుత్తి మాటలు చెప్పి కాలం గడుపుతున్నారే తప్ప, రోడ్డు వేసిన పాపాన పోలేదు. మోడల్ స్కూల్, జిల్లా ఉన్నత పాఠశాల, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులు ప్రతినిత్యం నరకం అను భవిస్తున్నారు. అదేవిధంగా మోడల్ స్కూల్ పాఠశాల, గే టు ఆవరణలో, గేటు బయట, హాస్టల్ విద్యార్థుల నుండే భవనం వద్ద, బురదమయంగా ఉంది. విద్యార్థులు పాఠ శాలకు వెళ్లాలన్న, తిరిగి రావాలన్న బురదలో జారి కింద పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలల్లో ఉంది. జిల్లా , మండల, గ్రామ ప్రత్యేక అధికారులు బురద రోడ్డుకు మరమ్మతులు చేయించి, గుంతలు, బురద లేకుండా చేయాలని విద్యార్థులు కోరు తున్నారు.