దళితుల శ్మశనవాటిక కబ్జాదారులపై చర్యలు తీసుకోండి

– మన్నే శ్రీధర్‌ రావు
నవతెలంగాణ-రంగారెడ్డిప్రాంతీయప్రతినిధి
రాజేంద్రనగర్‌ నియోజకవర్గం గండిపేట్‌ మండలం ఖానాపూర్‌ గ్రామంలో దళితుల శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జాకు ప్రయత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బ్యాగరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మన్నే శ్రీధర్‌రావు, జై భీమ్‌ సేన జై భీమ్‌ జాతీయ అధ్యక్షులు బల్వంత్‌ రావు, బ్యాగరి సంఘం సత్యం, శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధశారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. కబ్జాదారులు బాబీబారు, తుకారం, ప్రోత్సాహంతో నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర గవర్నర్‌, జిల్లా కలెక్టర్‌, ఆర్డీఓ, తహసీల్దార్లు స్పందించి కబ్జారాయుళ్లపై పీడీ యాక్ట్‌, ల్యాండ్‌ గ్రాబింగ్‌, అట్రాసిటి యాక్ట్‌ కేసులు నమోదు చేయాలని కోరారు. రాజకీయ పార్టీలు స్పందించి దళితుల శ్మశానవాటికను కాపాడేందుకు కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్మశాన వాటిక స్థలాలపై పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని తెలిపారు.