రథోత్సవానికి ఇబ్బందులు కలుగకుండా అక్రమనిర్మాణాల పట్ల చర్యలు తీసుకోండి

– గ్రామ కార్యదర్శి సందీప్ కు వినతి పత్రం అందజేత
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో ప్రతి సంవత్సరం రథోత్సవాలు అంగరంగ వైభోగంగా ఊరేగింపు నిర్వహిస్తారు. జిల్లా లో ఎక్కడ లేని విధంగా మద్నూర్ మండల కేంద్రంలో భారీ రథం ఉంది. దీని ఊరేగింపుకు ఉన్న రహదారి అక్రమ నిర్మాణాలకు గురి అవుతున్నట్లు ఇలాంటి అక్రమ నిర్మాణాల పట్ల రథోత్సవానికి ఊరేగింపుకు ఇబ్బందులు ఎదురవుతాయని, గ్రామ కార్యదర్శి సందీప్ అందజేసిన వినతి పత్రంలో గ్రామస్తులు పేర్కొన్నారు. దళిత వాడలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని, ప్రతి ఒక్కరూ ఇలాంటి నిర్మాణాలు చేపడితే రథోత్సవానికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయని, ముందు జాగ్రత్తగా ఫిర్యాదు పట్ల చర్యలు తీసుకొని రథోత్సవ రహదారిని అక్రమ కట్టడాలకు గురికాకుండా చూడాలని గ్రామస్తులు ముఖ్యంగా రథోత్సవ యువకులు గ్రామ కార్యదర్శి సందీప్ ను కోరారు.