పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి

– హైకోర్టులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పిటిషన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భద్రాచలం, స్టేషన్‌ ఘన్‌పూర్‌ల నుంచి బీఆర్‌ఎస్‌ చిహ్నంపై గెలిచిన తెల్లం వెంకటరావు, కడియం శ్రీహరి కాంగ్రెస్‌ పార్టీలో చేరడం పార్టీ ఫిరాయింపుల నిరెధక చట్టానికి వ్యతిరేకమంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ హైకోర్టులో బుధవారం పిటిషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్‌, కేంద్ర ఎన్నికల సంఘం, భద్రాచలం, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యేలను ప్రతివాదులుగా చేర్చారు. కడియం తన కుమార్తె కావ్యతో కలిసి, వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరారనీ, దీనిపై పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయని గుర్తు చేశారు.