అక్రమార్కులపై చర్య తీసుకోండి

నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్ : నల్గొండ జిల్లా కేంద్రంలో 59 జీవోని అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయలు విలువ గల ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న జర్నలిస్టులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నల్గొండ జిల్లా జర్నలిస్ట్ యూనియన్ టీయుడబ్ల్యుజె -ఐజెయూ కమిటీ కోరింది. సోమవారం నల్గొండలో కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి. ప్రభాకర్ రెడ్డి  జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి, ఐజెయూ నాయకులు దోసపాటి సత్యనారాయణ, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు దోటి శ్రీనివాస్, చిన్న పత్రికల సంఘం  జిల్లా అధ్యక్షుడు పిట్టల రామకృష్ణ నల్గొండ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ కు వినతి పత్రం అందజేశారు.