నైటింగేల్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌పై చర్యలు తీసుకోండి

– బీఆర్‌ఎస్‌ నాయకులు ఎం.వి.గుణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గత విద్యాసంవత్సరంలో జీఎన్‌ఎం మొదటి ఏడాది కోర్సులో 35 మంది విద్యార్థులకు ప్రవేశం ఇచ్చి ఒక్క క్లాసు చెప్పని నైటింగేల్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌ కాలేజ్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ నాయకులు, హైకోర్టు అడ్వొకేట్‌ ఎం.వి.గుణ డిమాండ్‌ చేశారు. శుక్రవారం విద్యార్థినీలు, వారి తల్లిదండ్రులతో కలిసి ఆయన హైదరాబాద్‌లోని నర్సింగ్‌ కౌన్సిల్‌ రిజిస్ట్రార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.