– ఎంజీఐటీ ప్రిన్సిపాల్ చంద్రమోహన్ రెడ్డి
నవతెలంగాణ-గండిపేట్
సాంకేతిక పరిజ్ఞాన రంగంలో రాణిస్తున్న విద్యార్థులందరూ అమెజాన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎంజీఐటి ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రొఫెసర్ చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం గండిపేటలోని ఎంజిహెచ్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు 26 నుండి మార్చి 2 వరకు అమెజాన్ వెబ్ సర్వీస్ పై విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన అమెజాన్ సేవలను రాబోయే రోజుల్లో ఉపాధి రంగాల్లో రాణించడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని ఉపాధి అవకాశాలను పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.