కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి ఇన్చార్జి ఎంపీడీవో బ్రహ్మానందం

నవతెలంగాణ-జక్రాన్ పల్లి

కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఇన్చార్జి ఎంపిడిఓ బ్రహ్మానందం గురువారం అన్నారు. మండలంలోని కొలిప్యాక్ చింతలూరు గ్రామాలలో వికా సీత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా కొలి ప్యాక్ చింతలూరు గ్రామాలలో వికసిత భారత సంకల్పయాత్ర వాహనానికి విద్యార్థులు ప్రజలు అధికారులు సప్పట్లతో స్వాగతం పలికారు. హెల్త్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్, ఉపాధి హామీ, ఐకెపి, తమ తమ శాఖల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  సర్పంచ్ ఆత్మకూరి గంగు, చింతలూరు సర్పంచ్ సుకన్య, ఎంపీ ఓ యూసుఫ్ ఖాన్, ఏపిఎం రవీందర్ రెడ్డి, ఉపాధిహామీ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు మహిళా సంఘ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.