
– కాటాపూర్ గ్రామపంచాయతీలో రైతులతో సమావేశం
నవతెలంగాణ -తాడ్వాయి
సహకార బ్యాంకు(డిసిసి బ్యాంక్) సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డిసిసి బ్యాంక్ ఏటూర్ నాగారం మేనేజర్ సంపత్ కుమార్ అన్నారు. బుధవారం గ్రామపంచాయతీ ఆవరణలో రైతులతో స్థానిక సర్పంచ్ పుల్లూరి గౌరమ్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగారంపై రుణాలను తక్కువ సమయంలో ఇచ్చే సదుపాయం ఉందన్నారు. సొసైటీ బ్యాంకు లో లాకర్ ఏర్పాటు కలదని, ఈ అవకాశాన్ని రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏ బ్యాంకులోనైనా రుణాలకు ఒక రోజంతా వేచి ఉండాలని, కానీ ఈ సొసైటీలో 20 నిమిషాల్లో ఒక గ్రాముకు రూ.4100 చొప్పున పొందవచ్చునని తెలిపారు. సొసైటీ లాభాల బాటలో ఉండడానికి సిబ్బందే కారణమన్నారు.
రైతులకు గోదాములు కూడా నిర్మించారని తెలిపారు. డిపాజిటర్ల కోరిక పై ఫిక్స్ డిపాజిట్లపై నెలసరి వడ్డీ చెల్లించబడుతుంది అన్నారు. సేఫ్ డిపాజిట్ లాకర్ సౌకర్యం కలగని, నెలవారి రికరింగ్ డిపాజిట్ పథకం కలగని, ఆర్ టి జి ఎస్, ఎన్ ఈ ఎఫ్ టి, మొబైల్ బ్యాంకింగ్ మరియు డిబిటి సౌకర్యం కలదు అన్నారు. పిఎం ఎస్బివై, పిఎం జె జె బి వై ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కలదు అన్నారు. రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గౌరమ్మ, పిఏసిఎస్ వైస్ చైర్మన్ లాలయ్య, డైరెక్టర్ పాలకుర్తి రజిత రవీందర్, మాజీ డైరెక్టర్ లు గడ్డం సత్యం, ఖాజా హుస్సేన్ రైతులు ముత్తినేని లక్ష్మయ్య, తదితర రైతులు పాల్గొన్నారు.