నవతెలంగాణ-తలకొండపల్లి
మండలంలోని వివిధ గ్రామాల్లో ఉపాధి హామీ ద్వారా చేపట్టబోయే పనులను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌డీఓ శ్రీలత అన్నారు. బుధవారం ఎంపీడీవో శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఉపాధి పనులపై సోషల్ ఆడిట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గతేడాది చేపట్టిన రూ.4.50 కోట్ల పనులపై 32 గ్రామపంచాయతీలకు సంబంధించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో తప్పకుండా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు. వర్మీ కంపోస్టు తయారు చేసుకోవాలని తెలిపారు. ఉపాధి హామీ ద్వారా ఆయా గ్రామాల్లో అవసరం మేరకు అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. ఉపాధి కూలీలు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ డీఆర్‌డీఓ సుభాషిణి, విజిలెన్స్ అధికారి కొండయ్య, అబుడ్స్ మెన్ సునీత, ఎస్‌ఆర్పీలు వెంకన్న, పీడీఆర్‌ఓ కాశన్న, ఏపీడీ గౌతమ్ చరణ్, ఏపీఓ కృష్ణ, ఈసీ కృష్ణ, గ్రామపం చాయతీ కార్యదర్శులు, సోషల్ ఆడిట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.